తాజాగా నటి మీరా చోప్రాకి ఎన్టీఆర్ అభిమానుల నుండి వేధింపులు వచ్చాయి. అందుకు కారణం ఏమంటే చాట్ సెషన్‌లో తనకి ఫేవరేట్ హీరో మహేష్ బాబు అని చెప్పడమే. అంతేగాకుండా తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని.. ఆయన గురించి తనకు తెలియదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన జూనియర్ ఎన్టీఆఱ్ ఫ్యాన్స్ మీరా చోప్రాని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఇక ఇలాంటి ట్వీట్లు రావడంతో విసుగెత్తిన మీరా చోప్రా.. ''ఒకరి ఫ్యాన్ కాకపోవడం అదేమైనా నేరమా? నాకు మాత్రం ఆ విషయం తెలీదు.. కానీ నేను మాత్రం ఓ విషయాన్ని అరిచి చెప్పాలనుకుంటున్నాను.. మీరు ఒక వేళ ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే మిమ్మల్ని రేప్ చేస్తామని, తల్లిదండ్రులను చంపుతామని బెదిరిస్తున్నారు. అలా అని ఆయన ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. వారంతా వారి హీరో పరువును తీస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.