మీరా జాస్మిన్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకురండి.. విశాల్

బుధవారం, 28 జూన్ 2017 (14:22 IST)
తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్‌ సంఘ ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ ప్రస్తుతం పందెం కోడి సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో పందెం కోడి పార్ట్-1లో నటించిన మీరా జాస్మిన్.. స్క్రిప్ట్ ప్రకారం కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వుంది. అయితే మీరా జాస్మిన్‌కు వివాహం కావడంతో ఆమె దుబాయ్‌లో సెటిల్ అయిపోయింది. 
 
అలాగే ఇకపై సినిమాల్లో నటించేందుకు ఆసక్తి లేదని చెప్పుకొస్తుంది. కానీ విశాల్ మాత్రం మీరా జాస్మిన్ కోసం దుబాయ్‌కి తన అసిస్టెంట్‌ను పంపినట్లు తెలుస్తోంది. ఎలాగైనా మీరాజాస్మిన్‌కు నచ్చజెప్పి పందెంకోడి సీక్వెల్‌లో నటించేందుకు ఆమె కాల్షీట్స్ ఇచ్చేలా ఒప్పించాలని చెప్పి పంపాడట. 
 
అంతేకాకుండా ఆమె ఎక్కడ వున్నా వెతికి పట్టుకురావాలని ఆదేశించాడట. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది. 2018 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి మీరా జాస్మిన్ విశాల్ పిలుపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి