అవును.. ఇది నిజం! కరోనా వచ్చి థియేటర్లు అన్నీ మూసేసారు. దీంతో కొత్త సినిమాలు రిలీజ్ ఆగిపోయాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేస్తారనే నమ్మకం లేకపోవడం. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా ప్రజలు సినిమా చూడడానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
భవిష్యత్‌లో ఓటీటీ అనేది మరింత విస్తృతంగా మారనుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆహాను మరింతగా విస్తృతపరిచేందుకు అల్లు అరవింద్ పక్కా ప్లాన్ రెడీ చేసారు. స్వయంగా అల్లు అరవిందే ఆహా ప్లాన్ ఏంటనేది మీడియాకు తెలియచేసారు. ఇంతకీ అల్లు అరవింద్ ఏం చెప్పారంటే.. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామని, 42 షోలు రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని అల్లు అరవింద్ చెప్పారు.
రెండు మూడేళ్లలో పెద్దపెద్ద స్టార్స్ అంతా ఓటీటీలోకి వచ్చేస్తారు. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ కోసం సంప్రదిస్తున్నాం అని చెప్పారు. కథ నచ్చితే చాలు. ఆయన నటిస్తారు. అందులో ఎలాండి డౌట్ లేదన్నారు. అల్లు అరవింద్ మాటలను బట్టి ఈపాటికే చిరంజీవితో ఓకే అనిపించుకున్నారనిపిస్తుంది. ఇంకా ఏం చెప్పారంటే... ఆహా నుంచి 42 షోలు రాబోతున్నాయి.