పరుచూరి వంకటేశ్వరరావును పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (12:48 IST)
ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మీ ఈ తెల్లవారు జామున మరణించారు. గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో పరుచూరికి చిరంజీవి ఫోన్ చేశారు. తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వ్యక్తిగతంగా పరుచూరి తనకు ఎంతో ఆప్తుడని, ఆయనతో తనకు చాలా అనుబంధం ఉందని చెప్పారు. విజయలక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోనిబ్బరాన్ని అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు