మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర లో రామరామ.. పాటను హనుమత్ జయంతి సందర్భంగా నేడు విడుదల చేశారు. రామ రామ..రామ.. అంటూ శంకర్ మహదేవన్, లిప్సిక పాడిన ఈ పాటలో చిరంజీవి బ్రుందం తన శైలిలో పండించారు. జై శ్రీరామ్ అనే చిరు వాయిస్‌తో పాట ప్రారంభమవుతుంది. రామ.. రామ.. అంటూ సాగే ఈ పాటను కీరవాణి స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.