చాలా ఏళ్ల క్రితం వచ్చిన "గ్యాంగ్ లీడర్" సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఆద్యంతం అలరింపజేశాయన్న విషయం తెలిసిందే.. ఇక పాటల సంగతికి వస్తే "పాప రీటా....",, "పాలబుగ్గ...", "భద్రాచలం కొండ... ", "వానా.. వానా...", "వయసు వయసు...", "పనిసా ససా..." వంటి పాటలు, వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు.