మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో చిరంజీవి చేసిన థమ్స్ అప్ యాడ్ అయితే ఎవర్ గ్రీన్. కానీ సినిమాలకి బ్రేక్ ఇచ్చాక కమర్షియల్ యాడ్స్‌కి దూరమయ్యారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినట్టే యాడ్స్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అవుతున్నారని సమాచారం.