మెగాస్టార్ చిరంజీవికి రాజీనామా ఎంత పని చేసింది

డీవీ

శనివారం, 26 అక్టోబరు 2024 (10:34 IST)
chiru-Nadu-Nedu
నటుడు చిరంజీవి జీవితంలో రాజీనామా అనేది ఆయన కెరీర్ ను మార్చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఆయన కాలేజీ డేస్ లో నటనపై మక్కువ వుండేది. రంగస్థలంలో పలు నాటకాలువేశారు. నర్సాపూర్ లో వై.ఎన్.ఎం. కాలేజీలో చదువుతుండగా ‘రాజీనామా’  అనే నాటకాన్ని ‘రంగస్థలం’ మీద తొలి నాటకంగా వేశారు.  కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు  పొందింది.

అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం వచ్చింది. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం గురించి మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో అభిమానులతో ఎనలేని ఆనందం పంచుకున్నారు. 74లో ఆయన ఫొటో కూడా పోస్ట్ చేసి అభిమానులకు ఫిదాచేశారు.
 
సహజంగా చిరంజీవికి గతకాలంపు కష్టం, జ్నాపకాలు చాలా ఇష్టం. ప్రతీదీ ఆయన తన మదిలో వుంచుకుంటూ గతాన్ని ఆస్వాదిస్తుంటారు. కాలక్రమేణా వెండితెరపై వెలుగొందుతున్నా ఆయా పాత్రల గుర్తులను పదిలంగా ప్రత్యేకమైన రూమ్ లో ఏర్పాటు చేసుకుంటుంటారు. యాభై సంవత్సరాల సినీ కెరీర్ తోపాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవలు చేసినందుకుగాను ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కొణిదెల చిరంజీవికి చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు