మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఒక్కోటి బయటకు విడుదల చేస్తుంది చిత్రయూనిట్. శనివారంనాడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరు, చరణ్ స్టిల్‌ను విడుదల చేసింది. నక్సల్ గెటప్స్ లో తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. చిరు వెనుక చరణ్ కనిపిస్తూ అదనపు బలంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి మాత్రం ఇది డబుల్ మెగా ట్రీట్ అనే చెప్పాలి.