రేష్మి జబర్‌దస్త్‌లో ఫైర్ బ్రాండ్. తన బాయ్‌ఫ్రెండ్ సుధీర్‌పై రకరకాలుగా సెటైర్లు, జోక్స్ వేస్తుంటుంది. ఇద్దరూ సీరియస్‌గా తెరపై పెండ్లిచేసుకుంటారు. ఆ తర్వాత మామూలుగానే వుంటారు. పెళ్లి గురించి అడిగి అడిగిన రోజాకు, చూసే ప్రేక్షకులకు విసుగుపెడుతుంది కూడా. అయితే ఇటీవలే రేష్మి తన వ్యక్తిగత లైఫ్ గురించి మంచి కామెంట్ చేసింది. నేను ఎక్కడకు వెళ్ళినా.. ఏ సినిమాలో నటించినా సుధీర్‌తోనే వుండాలంటున్నారు. ఇదేం పిచ్చో అర్థంకావడంలేదు. మేం చేసేది వృత్తి. నటన. జబర్‌దస్త్‌లో నటిస్తామ్. సినిమాల్లో నటిస్తాం. కానీ అది అంతవరకే. వేరే హీరోతో నటించకూడదా. నటిస్తే తాటాకులు కట్టేస్తున్నారు. మగాళ్ళయితే
ఎంతమందితోనైనా పులిహోర కలపవచ్చా! ఆడవాళ్ళు అలా చేయకూడదా!