మిస్స‌వ‌కుండా చూసే మిస్సింగ్ః మారుతి

శనివారం, 24 జులై 2021 (18:48 IST)
Missing team-maruti
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "మిస్సింగ్". ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై "మిస్సింగ్" మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. 
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ, మిస్సింగ్ ట్రైలర్ చూస్తే ఒక క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తోంది. ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్ కనిపిస్తోంది. బడ్జెట్ చిన్నదా పెద్దదా కాదు ఓ మంచి సినిమా చేశారని చెప్పగలను. మనల్ని లైఫ్ లో నమ్మాల్సింది తండ్రి. ఆ తండ్రే ప్రోత్సహించి వీళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఇంతకంటే బ్లెస్సింగ్స్ ఎవరివీ అక్కర్లేదు. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మిస్సింగ్ టైటిల్ లాగే ఈ సినిమాను ఎవరూ మిస్ అవరు అనుకుంటున్నా. తప్పకుండా ప్రేక్షకులు మిస్సింగ్ సినిమా చూస్తారు. సక్సెస్ మీట్ కు కూడా మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా. అన్నారు
 
బన్నీ వాసు మాట్లాడుతూ, క‌రోనా వ‌ల్ల చిన్న సినిమాల‌పై భారం ప‌డుతుంది. అందుకే మా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఎన్ని వీలైతే అన్ని సినిమాలను రిలీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలబడవలసిన సమయం ఇది. డైరెక్టర్ శ్రీని మా పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. టాలెంటెడ్ టెక్నీషియన్ తను. మిస్సింగ్ మూవీ ట్రైలర్ బాగుంది. విడుదల విషయంలో కాస్త ఓపిక పట్టండి, ఆగస్టు, సెప్టెంబర్ లో పరిస్థితి సెట్ అయితే మల్లీ థియేటర్లకు జనం బాగా వస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
 
చిత్ర నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ, మా పిల్ల‌ల‌కు సినిమా తీయాలనే కోరిక ఎంత ఉండేదో సినిమా చేయాలనే కోరిక మాకూ అంతే ఉండేది. అందుకే మా పిల్లలతో సినిమా నిర్మించాం. మా అబ్బాయి మారుతి అంత పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా. నేను బన్నీ వాసు అంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటే స్వార్థం అవుతుందేమో. మా సినిమాకు బన్నీ వాసు, మారుతి గారు సహకారం అందించాలని కోరుతున్నా అన్నారు.
 
సంగీత దర్శకుడు అజయ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. మంచి పాటలు ఇచ్చానని నమ్మకంతో ఉన్నా. అశోక్ వల్ల మిస్సింగ్ మూవీ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. చక్కటి ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.
హీరో హర్ష, దర్శకుడు శ్రీని జోస్యుల, హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్నీ కథలో ఉన్న మూవీని చేశామ‌ని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు