మెగాస్టార్ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
రెండు పాటలు, క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14న చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల.