వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

సెల్వి

బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (18:53 IST)
Woman
చిన్న చిన్న విషయాలకే ఆవేశానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశం ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా భార్యాభర్తల గొడవ ఓ చిన్నారితో పాటు ఓ తల్లిని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం, సంతనూతలపాడులో సుజాత, వెంకటేశ్వర్ల దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. 
 
ఈ దంపతులకు 9 నెలల చిన్నారి కూడా వుంది. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. తన తొమ్మిది నెలల చిన్నారితో పాటు ఆమె చెరువులో దూకినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
సుజాత ఆత్మహత్యకు ముందు తన తొమ్మిది నెలల చిన్నారితో కలిసి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు స్థానిక టీవీ ఫుటేజ్‌‌లో నమోదైనాయి. వీటి ఆధారంగానే సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చెరువులోని సుజాత, చిన్నారి మృతదేహాలను వెలికితీశారు. 

చెరువులో దూకి 9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో చెరువులో దూకి 9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లుతో గొడవ జరిగింది. దీంతో సుజాత ఆత్మహత్య చేసుకుంది. చెరువులో దూకినట్లు సమాచారం అందుకున్న… pic.twitter.com/3UL0lzpuAJ

— ChotaNews App (@ChotaNewsApp) February 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు