ఆ సినిమాలోని సీన్ మొత్తం కాపీకొట్టారు.. రాజమౌళికి యువ డైరెక్టర్ కౌంటర్

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమనే కాదు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సైతం అంతర్జాతీయ ఖ్యాతిని కల్పించిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి. అలాంటి దర్శకుడిపై ఓ యువ దర్శకుడు నోరు పారేసుకున్నారు. రాజమౌళి కాపీల కింగ్ అంటూ సెటైర్లు వేశారు. పర భాషా చిత్రాలను కాపీకొట్టి, వాటిని అటూ ఇటూగా మార్చి, ఆడియన్స్ పల్స్‌కు అనుగుణంగా తీయడంలో మంచి దిట్ట అంటూ వ్యాఖ్యానించారు. ఆయన అలా విమర్శలు గుప్పించడానికి కారణాలు లేకపోలేదు. 
 
ఆస్కార్ విన్నింగ్ సినిమా 'పారాసైట్' చూస్తుంటే నిద్ర వ‌చ్చింద‌ని, సినిమా చాలా బోర్ అని సంచ‌ల‌న కామెంట్స్ చేయడంతో నెటిజ‌న్స్ ఎస్.ఎస్.రాజ‌మౌళిని ఏకిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళిపై ఓ కుర్ర దర్శకుడు ఓపెన్ లెట‌ర్ రాస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణలు హీరోలుగా నటించిన "మిఠాయి" చిత్రానికి ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. 
 
'పారాసైట్ చిత్రం వాస్త‌విక‌త‌కి అద్దం ప‌ట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శ‌క్తివంత‌మైన‌దిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేద‌ని రాజ‌మౌళి అన‌డం ఏ మాత్రం బాగోలేదు. అందుకే ఈ లెట‌ర్ రాస్తున్నాను' అని ప్ర‌శాంత్ కుమార్ పేర్కొన్నాడు.
 
ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు 'పారాసైట్‌'ని ఎంత‌గానో ప్రశింసించారు.. కానీ 'బాహుబలి'ని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని.. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ "సై" సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేశారు అని ప్ర‌శాంత్ కుమార్ తన లేఖలో ఏకిపారేశారు. 
 
'సై'తో పాటు మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే. ప‌బ్లిక్ ప్లాట్‌ఫాంలో 'పారాసైట్' లాంటి చిత్రాన్ని మీరు కించ‌ప‌ర‌చ‌డం ఏ మాత్రం బాగోలేదు. సినిమా చూడాలంటే నిర్ధిష్ట మాన‌సికస్థితి మ‌రియు మనస్సు అవ‌స‌రం అని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరు ఆ మాన‌సికస్థితిలో లేర‌ని నేను భావిస్తున్నాను' అని ప్ర‌శాంత్ కుమార్ త‌న లెట‌ర్‌లో పేర్కొన్నారు. 

 

S.S Rajmauli slept off while watching Parasite & found it boring and slept off
More than anything, Parasite is an original piece of work. Originality deserves respect, especially when it is powerful enough to cut across language barriers and Parasite has done that, my open letter pic.twitter.com/XQt4QnCFYl

— prashant Kumar (@zimbo_7) April 23, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు