నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ఠాగూర్

గురువారం, 12 డిశెంబరు 2024 (16:29 IST)
సీనియర్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ఆయ గురువారం ఇంటికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఆయనకు ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. 
 
బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయన్నారు. రెండు రోజుల చికిత్స తర్వాత గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. తన నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈనెల 24 వరకు స్టే ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు