సోదరా.. మీరు ముఖ్యమంత్రి కావాలి : స్టాలిన్‌తో మోహన్ బాబు

సోమవారం, 27 ఆగస్టు 2018 (12:39 IST)
డీఎంకే అధ్యక్షుడుగా ఎన్నికకానున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు విలక్షణ నటుడు మోహన్ బాబు ముందుగా అభినందనలు తెలిపారు. సోదరా... మీవు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
 
ఇటీవల మరణించిన కరుణానిధి సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమానికి మోహన్ బాబును ఆహ్వానించారు. 
 
దీంతో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరుణ ఒక గొప్ప లెజెండరీ ఫాదర్ అని కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు