మోహిని ఫస్ట్ లుక్ రిలీజ్.. కాళిమాతగా దర్శనమిచ్చిన త్రిష.. బ్లూ అవతార్‌గా..?

బుధవారం, 19 అక్టోబరు 2016 (12:58 IST)
నాయకిగా అలరించిన త్రిష.. మోహినిగా కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మంగళవారం రిలీజైంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిష కాళీమాతలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ కాళీ దేవతని ఇన్స్పైర్ అయినట్టుగా తెలుస్తోంది. త్రిష ఇందులో ఎనిమిది చేతులతో వివిధ రకాల ఆయుధాలు కలిగి కనిపించింది.

దీన్ని బట్టి త్రిష ఇందులో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బ్లూ అవతారంలో త్రిష ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. రమణ మాదేష్ మోహిని సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇంకా హాలీవుడ్ మూవీ హారీ పోర్టర్ సిరీస్ కోసం పనిచేసిన విఎఫెక్స్ టీం మోహిని సినిమాకు పనిచేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ జక్కి భగ్నానీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సూర్య సింగం3 ను తెరకెక్కించే ప్రిన్సెస్ పిక్చర్స్ సంస్థ మోహినిని నిర్మిస్తోంది. మోహిని ఎక్కువ శాతం షూటింగ్ యుకె, మెక్సికో,  థాయ్‌లాండ్‌లలో తెరకెక్కించారు.  
 
కళావతి, నాయకి సినిమాల తర్వాత లేడి ఓరియెంటెడ్‌ రోల్‌లో త్రిష నటిస్తోంది. ఇప్పటికే 90 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యిందని క్రిస్‌మస్ లోపు సినిమాను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి