ఉమా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అతను చాలా కష్టమైన పనిని సాధించడానికి ముందుకు వెళ్లాడు. ఈ ఘనత సాధించడానికి అతని కృషి , దృఢ సంకల్పం అతనికి సహాయపడ్డాయి. అతని మాటలతో నేను చాలా చలించిపోయాను. అతను మన యువతకు స్ఫూర్తి. ఇంత చిన్న వయసులో అతని సంకల్పం చూస్తుంటే మన భారతీయ యువత ఏదైనా చేయాలనీ మనసులో భావిస్తే.. దానిని సాధించేవరకూ నిద్రపోరని ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారని సోనూ సూద్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ట్విట్ రీ ట్విట్స్ తో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే సోనూ సూద్ దాతృత్వానికి .. బాధితుల బంధువులు, స్నేహితులు జేజేలు పలుకుతున్నారు. సోనూ చేసిన సేవలను సాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.