ఆ యువకుడి పరిస్థితి వివరిస్తూ దాతలు సాయం చేయాలని మీడియాలో కథనాలు వచ్చాయి. సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రాంబాబుకి ఫోన్ వచ్చింది. తాను సోనూసూద్‌నని ఇంగ్లీషులో మాట్లాడుతూ పరిచయం చేసుకున్నాడు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుని సాయం చేస్తానని నమ్మబలికాడు. సాయంత్రం రూ.3 లక్షలు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చాడు.
అయితే, ముందుగా జీఎస్టీ ఫీజు కింద రూ.12 వేలు, రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేలు కట్టాలని చెప్పాడు. నమ్మిన రాంబాబు స్నేహితుడు సాయంతో ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌లో రూ.2 వేలు వేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం పోలీసులు ఆరా తీస్తున్నారు.