ఇందులోభాగంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, చార్మీల వద్ద సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగా, గురువారం ముమైత్ ఖాన్ వద్ద విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ ఎదుర్కొంటున్న వారిలో రెండో మహిళ ముమైత్ కావడం గమనార్హం.
ఇదిలావుంటే, ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో నుంచి ముమైత్ ఖాన్ శాశ్వతంగా వైదొలిగినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చే సమయంలో ముమైత్‌కు సహచరులు కన్నీటితో వీడ్కోలు పలికారు. అయితే ముమైత్ ఖాన్ షో నుంచి పర్మినెంట్‌గా తప్పుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.