టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుపై తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా పేరుగాంచిన ముమైత్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం జెమినీ టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతో పాటు ముమైత్ ఖాన్ హాజరైంది. ఆ తర్వాత సంపూ గురించి కొన్ని ట్విట్టర్‌లోని కొన్ని ఆశ్చర్యకరమైనో పోస్టులు చేశారు. "సంపూ.. నువ్వు నా దృష్టిలో ఒక సూపర్ స్టార్.. నాడు యూ ట్యూబ్‌లో నీ వీడియోలు చూశాను.. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వ్యూయర్స్ నీ గురించి నీ కామెడీ సీన్ల గురించి చెపుతూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్నపుడు ఆ నీరసం నుంచి కోలుకోవడానికి నీ కామెడీతో నవ్విస్తూ నాకెంతో సాయం చేశావు.. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ ముమైత్ ఖాన్ ట్వీట్ చేసింది.