కుమార్తెను హత్య చేసిన కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీ - పీటర్ ముఖర్జీలు విడిపోయారు. వీరికి ముంబై కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2012లో షీనాబోరా అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితులైన దంపతులు పీటర్, ఇంద్రాణి ముఖర్జీలను అరెస్టు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. పీటర్ (64) ఎలక్ట్రానిక్ మీడియా అధిపతి. తన కంటే 16 ఏళ్ల వయసు చిన్నదైన ఇంద్రాణిని పీటర్ వివాహమాడారు.
అయితే, షీనా బోరా హత్య కేసులో వీరిద్దరూ అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న భార్యాభర్తలు పీటర్, ఇంద్రాణిలు తమకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కోసం భార్యాభర్తలిద్దరూ అంగీకరించడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్ఎస్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు. ముంబై ఫ్యామిలీ కోర్టుకు పీటర్, ఇంద్రాణిలు హాజరయ్యారు.