వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మర్డర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. నగ్నం, థ్రిల్లర్, క్లైమాక్స్, కరోనా వైరస్ వంటి షార్ట్ ఫిల్స్‌తో పాటు పవర్ స్టార్ మూవీని వర్మ తీశాడు. తెలంగాణలోని మిర్యాలగూడలో సంచలనం కలిగించిన మర్డర్ కేసుపై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మర్డర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
పిల్లల్ని ప్రేమించడం తప్పా?, తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? అని ఈ ట్రైలర్లో ప్రశ్నించారు. ప్రణయ్ - అమృతల హత్య కేసును సినిమాగా రూపొందిస్తున్నట్లు ప్రకటించి గతంలోనే మరో సంచలనానికి తెరలేపాడు వర్మ.
ఈ ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించారు. ఆర్జీవీ మర్డర్ ట్రైలర్ ఎలాంటి వివాదాలు రేపుతుందో అనుకునేలోపే మరో ట్రైలర్ 29వ తేదీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, ఐదు భాషల్లో మర్డర్ మూవీ ట్రైలర్ విడుదలైంది.