డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభం

సెల్వి

బుధవారం, 24 సెప్టెంబరు 2025 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం జరిగిన కీలకమైన సమీక్ష సమావేశాలలో పాల్గొన్నారు. 
 
వైద్యులు డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఇక పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన వెలువడింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన శీఘ్రంగా కోలుకోవాలని జనసైనికులు, పవన్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా గురువారం (సెప్టెంబర్ 25) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. 
 
సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు