''నువ్వు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయకపోతే నీ అంత ఇడియట్ మరొకరు వుండరని అమ్మ కోపంగా తిట్టింది. ఖచ్చితంగా అమ్మ కోరిక నెరవేరుస్తా. తెలుగులో నటిస్తాన''ని విశాల్ అన్నారు. ఆయన నటించిన మరుదు చిత్రం తెలుగులో రాయుడుగా విడుదలైంది. మంచి కలెక్షన్లతో నడుస్తున్న ఈ చిత్రం సక్సెస్‌మీట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. రెండు భాషల్లో ఈ చిత్రం సక్సెస్ అయింది. మాస్‌లో మంచి పేరు వచ్చింది. దర్శకుడు ముత్తయ్యతో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. తెలుగు నిర్మాత హరితో ఇంతకుముందే సినిమా చేయాల్సింది కానీ రాయుడుతో కుదిరింది. అలాగే కేరళ, కర్నాటక, ఒరిస్సాలో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని చెప్పారు. అంతేకాకుండా పందెంకోడి-2 చిత్రాన్నికూడా చేయబోతన్నానని చెప్పారు.