ఎన్.శంకర్ తీసిన అనియన్ 2005లో వచ్చింది. విక్రమ్‌కు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు త మిళ రాష్ట్ర అవార్డుకూడా దక్కింది. ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ సినిమాను తెలుగులో `అపరిచితుడు`గా డబ్ చేయగా, హిందీలో `అపరిచిత్`గా విడుదల చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు రీమేక్ చేయడం విశేషం. ఇంకా దేశంలో అవినీతిపోలేదు. దానికి సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు ఎన్. శంకర్ తెలియజేస్తున్నాడు.
1996లో కమల్‌హాసన్‌తో `భారతీయుడు` చిత్రాన్ని తీసి అందరి దృష్టి ఆకర్షించిన శంకర్, ఆ తర్వాత రజనీకాంత్‌తో `శివాజీ,``ఎంతిరణ్`, రోబో రెండు భాగాలు చేశారు. రోబో సినిమా హాలీవుడ్ స్థాయిలో వుండడంతోపాటు పిల్లలని సైతం అబ్బురపరిచింది. మేథావులను కూడా ఆకట్టకుంది.
రీమేక్‌పై రణవీర్ స్పందిస్తూ, శంకర్ అద్భుత సృష్టిలో నేను భాగం కావడం అదృష్టంగా వుంది. ఆయనతో సినిమా చేయాలనే ఏ హీరోకైనా అనిపిస్తుంది. ఆ సినిమాతో విక్రమ్ ప్రముఖ భారతీయ నటులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. విక్రమ్ అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరు, నేను ఎంతో ఆరాధించే ఒక కళాకారుడు, ఆయనంత చేయలేకపోయినా నటుడిగా శక్తియుక్తులు ఈ సినిమాకు కేటాయిస్తాను అని తెలిపారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నట్లు గడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే