జర్నలిస్ట్‌గా నాగ చైతన్య కొత్త అవ‌తారం

శుక్రవారం, 28 జనవరి 2022 (13:12 IST)
Naga Chaitanya
ల‌వ్‌, యాక్ష‌న్ అంశాల‌తో కూడిన సినిమాల్లో న‌టించిన నాగ చైతన్య తాజాగా జర్నలిస్ట్‌గా కొత్త కోణంలో క‌న్పించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే 'బంగార్రాజు` స‌క్సెస్ జోష్‌లో వున్న చైత‌న్య తాజాగా  అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే బంగార్రాజు మీటింగ్‌లో ప్ర‌శ్నిస్తే వెబ్ సిరీస్ ఒక‌టి చేస్తున్న‌ట్లు చెప్పాడు. ఇప్పుడు అది ఖ‌రారైంది.
 
ఈ పాత్ర కోసం చైత‌న్య త‌న బాడీని మార్చుకోనున్నారు. ప్ర‌స్తుత‌తం `థ్యాంక్యూ` సినిమా షూట్ లో వున్నాడు. అది కొద్దిరోజుల్లో పూర్త‌వుతుంది. ఇక ఆ త‌ర్వాత వెబ్ సిరీస్ చేయ‌నున్నాడు. చైతన్య ప్రియా భవానీ శంకర్ ఆయ‌న‌కు జోడీగా న‌టించ‌నుంది. టైమ్ ట్రావెల్ చుట్టూ తిరిగే ఈ క‌థ‌లో ప్రతి సీజన్‌లో దాదాపు 8-10 ఎపిసోడ్‌లు ఉంటాయని తెలుస్తోంది.
 
థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు '24' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకుడు. నాగ‌చైత‌న్య‌ను స‌రికొత్త‌గా చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ  సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ పనులను త్వరలో ప్రారంభించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు