బాలీవుడ్‌లోకి నాగచైతన్య.. అమీర్ ఖాన్‌తో నటించే ఛాన్స్

మంగళవారం, 26 జనవరి 2021 (09:42 IST)
టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారగా, ప్రస్తుతం అక్కినేని హీరో నాగ చైతన్య కూడా ఈ జాబితాలో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 
 
ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ పొందిన చైతూ ఇప్పుడు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించి అక్కడి వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడట.
 
అమీర్ ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలని అనుకున్నారు. కాని అతనికి ఉన్న బిజీ షెడ్యూల్ వలన అది సాధ్యం కావడం లేదు. దీంతో ఆ ఆఫర్ చైతూ దగ్గరకి వచ్చినట్టు తెలుస్తుంది. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో చైతూ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు