టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున నటిస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీ రామ్ బావాజీ'గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఈ చిత్రానికి ఇతర ప్యాచ్ వర్క్‌ను కూడా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించారు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150', నందమూరి నటసింహం బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నెలకొనవుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున కాస్త వెనక్కి తగ్గారు. అందుకే తన చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం విడుదలను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.