చిరంజీవి సంక్రాంతి వేడుకల్లో నాగార్జున‌

శనివారం, 16 జనవరి 2021 (16:49 IST)
ఈ ఏడాది సంక్రాంతి సంబ‌రాలు ఎవ‌రి స్థాయి మేర‌కు వారు చేసుకున్నారు. సినిమా హీరో హీరోయిన్లు కూడా పండుగ వేడుక‌ను బాగానే జ‌రుపుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి త‌న కుటుంబీకుల‌తో మూడు రోజుల పండుగ‌ను బోగి, సంక్రాంతి, క‌నుమ‌ను బాగా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అల్లు శిరీష్ పోస్ట్ చేయ‌డంతో క‌నుల‌కు ఇంపుగా అనిపించింది.
 
చిరంజీవి త‌న కూతుర్ల‌తో దిగిన ఫొటోతో పాటు త‌న కుటుంబ హీరోల‌తో దిన‌గి ఫొటోలు ముచ్చ‌ట గొలిపాయి. అయితే వీట‌న్నికంటే.. బాగా ఆక‌ట్టుకుంది మాత్రం నాగార్జున దిగిన ఫొటో.. మెగా హీరోల‌తోపాటు త‌ను కూడా వుండ‌డం విశేషం. సంక్రాంతి వేడుక‌ను మెగా ఫ్యామిలీతో జ‌రుపుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఇలాంటి ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం చాలా క‌ష్టం. హీరోలంద‌రూ క‌లిసిమెలిసి పండుగ జ‌ర‌పుకోవ‌డం చాలా అరుదైన విష‌యం. మెగా హీరోలతో నాగ్ దిగిన ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవితో పాటు నాగార్జున, రామ్ చ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ ప‌లువురు ఉన్నారు.
 
యంగ్ హీరోల‌కు పోటీనిస్తూ చిరంజీవి, నాగ్ మ‌రింత యంగ్‌గా క‌న‌ప‌డుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు