కంటతడి పెట్టిస్తున్న అక్కినేని నాగార్జున ట్వీట్...

బుధవారం, 29 ఆగస్టు 2018 (16:30 IST)
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ చూస్తూ కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఏమని రాశారంటే... " నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే నాతో అన్నారు. కానీ ఇప్పుడు ఇకలేరు, మిస్ యు అన్న" అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 
 
కాగా నాగార్జున గతంలో హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో తమ్ముడిగా నటించారు. ఆ చిత్రంలోని ఫోటోని షేర్ చేస్తూ నాగ్ ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు