బిగ్ బాస్ 3 స‌భ్యుల గురించి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన నాగార్జున‌

శుక్రవారం, 26 జులై 2019 (14:47 IST)
బిగ్ బాస్ 3 షో ఇటీవల‌ ప్రారంభం కావ‌డం... ఈ షోకు విశేష స్పంద‌న వ‌స్తుండ‌టం తెలిసిందే. అయితే.. షో స్టార్ట్ కాకుండానే వివాదాలు రావ‌డంతో.. ఈ షోను వాయిదా వేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అనుకున్న డేట్‌కే బిగ్ బాస్ 3ని ప్రారంభించారు. ఈ బిగ్ బాస్ హౌస్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, టీవీ ఆర్టిస్టులను ఎంపిక చేశారు. 
 
వారిలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్ త‌దిత‌ర‌ ప్రముఖులు ఉన్నారు. అయితే... బిగ్ బాస్ 3 స‌భ్యుల సెలెక్ష‌న్లో రిక‌మండేష‌న్స్ ఉన్నాయ‌ని... కొంతమంది ఆరోపించ‌డం తెలిసిందే. మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగార్జున మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ... బిగ్ బాస్ 3 గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట పెట్టారు. 
 
అది ఏంటంటే... ఈ షోకి నేను హోస్ట్ అయినప్పటికీ ఎంపికైన 15మంది సభ్యుల లిస్ట్ కేవలం షోకి ఐదు నిమిషాల ముందు చెప్పార‌ని నాగార్జున తెలియ‌చేసారు. ఆ 15 మందిలో కొంతమంది తెలియ‌క‌పోతే... వాళ్లు ఎవ‌రో..? ఎందుకు సెలెక్ట్ చేసారో..? చెప్పి వాళ్ల‌కు సంబంధించిన వీడియోస్ కూడా చూపించార‌ని నాగ్ చెప్పారు. షో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబ‌ట్టి.. ముందుముందు మ‌రింత ఆస‌క్తిగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు