పైసా వసూల్ సినిమాలో యూత్ హీరోలకు తానేం తక్కువ తినలేదంటూ ఫుల్ ఎనర్జీ చూపించిన నందమూరి హీరో బాలకృష్ణ.. తాజాగా ఓ స్టేజ్ షోలో అదరగొట్టేశారు. స్టేజ్ పై యాక్షన్ సీన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేగాకుండా తన స్టైల్‌ను మరిచిపోకుండా దిగ్గజ నటులు చూస్తుండగానే తొడగొట్టేశాడు. ఈ షోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే, చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణను స్టేజ్ పైకి ఆహ్వానించారు. స్టేజ్ పైకి బాలయ్య వెళ్లగానే, స్టేజ్‌పై స్టంట్ చేసి చూపించగలరా అని వ్యాఖ్యాత అడగటంతో ఏమాత్రం తడవుకోకుండా ఓకే చెప్పిన బాలయ్య.. స్టంట్ మాస్టర్స్‌ను కుమ్మేశారు. నలుగురు స్టంట్ మాస్టర్లు బాలయ్యను చుట్టుముట్టారు.
వారిపై అటాక్ చేసిన బాలయ్య నలుగురు కుమ్మేసి తొడగొట్టడంతో చప్పట్లు అదిరిపోయాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ నటులు రజనీకాంత్, మోహన్ లాల్, సూర్య పలువురు నటులు బాలయ్య ఫైట్‌ను, ఆయన తొడగొట్టిన పర్‌ఫార్మెన్స్‌ను ఆసక్తిగా తిలకించారు.