జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఠాగూర్

సోమవారం, 4 ఆగస్టు 2025 (10:36 IST)
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబు సొరేన్ ఇకలేరు. ఆయన వయసు 81 యేళ్లు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం శిబు సొరేన్ అలుపెరగని పోరాటం చేశారు. ఇందుకోసం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్ఛా అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 
 
భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త.... 
 
ఏపీలోని ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మార్కాపురం మండలంలోని రాయవరంలో చోటుచేసుకుంది. 
 
మార్కాపురం గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన వనమాల బ్రహ్మయ్య అనే వ్యక్తి మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కూలి పనుల కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన సందర్భంగా భార్య చెన్నమ్మను భర్త కొట్టడంతో ఆమె పిల్లలను తీసుకని రాయవరంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మనస్తాపానికి గురైన భర్త పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు అదుపు చేసి 108కు సమాచారం అందజేయడంతో సిబ్బంది వచ్చి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 40 శాతం కాలిన గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు