ఈ సందర్భంగా నాని, శేష్ మాట్లాడుతూ, చంపేశాం, థియేటర్‌లో హిట్ 2 బంపర్ హిట్ అంటూ ఆనందంతో కేకలు వేశారు. కాగా, ఈ సినిమాలో ముగింపులో నాని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా దర్శనమిస్తాడు. దీనిని కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య వచ్చినట్లుగా కంపేర్ చేసుకుంటూ ఆ సినిమాతో పోల్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాని సోదరి, బావ, చిత్ర దర్శకుడు శైలేష్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.