Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

దేవీ

బుధవారం, 9 జులై 2025 (18:56 IST)
Nani- The Paradise
నేచురల్ స్టార్ నాని సరికొత్త చిత్రం 'ది పారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా చిత్రం తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న చిత్రమిది.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా ఉండనుంది.
 
'ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ 8 భాషలలో విడుదల కానుంది.
 
టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఉన్న పవర్‌ఫుల్ డైలాగ్, విజువల్స్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్‌ బ్యాగ్రౌండ్ స్కోర్, నాని స్ట్రాంగ్ ఎంట్రీ... ఇవన్నీ సినిమా పై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 మార్చి 26, 2026న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు