విజయదశమి రోజున #నాని 29.. కొత్త లుక్‌లో కనిపిస్తాడట

బుధవారం, 13 అక్టోబరు 2021 (19:07 IST)
Nani
విభిన్న కథలతో తెలుగు సినీ ప్రేమికులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నేచురల్ స్టార్ నాని.. తన తర్వాతి సినిమా నుంచి బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చాడు. 
 
దసరా పండుగ రోజున తన 29 సినిమాను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాడు. 15వ తేదీన మధ్యాహ్నం 1.53 గంటలకు తన 29 సినిమా పూర్తి వివారాలు వెల్లడిస్తానంటూ.. తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు నాని. దీంతో నాని ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాని 29వ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది. 
 
ఈ చిత్రంలో నాని మునుపెన్నడూ కనిపించని లుక్‌లో కనిపిస్తాడని, ఆయన పాత్ర పాత్ర కూడా చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా.. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే.. ఇటీవల నాని నటించిన.. టక్‌ జగదీష్‌ మంచి విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు