Neelakanta, Sai Ronak and others
టాలీవుడ్ డైరెక్టర్ నీలకంఠ తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో "షో" అనే ఫీచర్ ఫిల్మ్ తో రెండు జాతీయ అవార్డులు, అలాగే "విరోధి" మరియు "షో" చిత్రాలకు గాను ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయిన దర్శకుడు నీలకంఠ ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమా లతో ఆకట్టుకున్నారు. సినిమాల నుండి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి "సర్కిల్" అనే చిత్రంతో వస్తున్నారు. "ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.