తెలుగు సినిమా ఇప్పుడు ఎమోషన్ల దారి పట్టింది. అది ఎంత కళాత్మకంగా తెరకెక్కుతోందంటే వరుసగా ప్రతి సంవత్సరం ఎమోషన్లను పీక్కి తీసుకుపోయిన చిత్రాలకే జాతీయ అవార్డుల పంట పండుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమనే విడుదలైన శతమానంభవతి సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికై సంచలనం గొలిపించింది. చిత్ర దర్శకుడే తన సినిమాకు అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు కలా నిజమా అనిపించేంత ఆశ్చర్యానికి గురవడం విశేషం.
64వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా రెండు పెద్ద సినిమాల మధ్య విడుదలై అపూర్వ ప్రజాదరణను నోచుకున్న తన సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగ్నేశ సంతోషం వ్యక్తం చేశారు.
"శతమానం భవతి చిత్రానికి అవార్డు వచ్చినట్లు మా ప్రొడక్షన్ టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వాళ్లు జోక్ చేశారనుకున్నారు. ఈ సినిమాకు అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నిజంగా సర్ఫ్రైజే. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్ చెప్పాలి’ అంటూ చిత్రదర్శకుడు దర్శకుడు సతీష్ వేగ్నేశ్ వార్తవినగానే పొంగిపోయారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'శతమానం భవతి' బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.