షెర్లాక్ హోమ్స్‌ ఫిక్షనల్ ఐ యామ్ ఒరిజినల్ అంటున్న నవీన్ పోలిశెట్టి

బుధవారం, 21 జూన్ 2023 (17:15 IST)
Naveen Polishetty at Sherlock Holmes
ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ 2019 జూన్ 21 న విడుదలైన కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.  తెలుగు సినిమా.నెల్లూరు కు చెందిన ఒక నేర పరిశోధకుడి నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి తో పాటు అందరు కొత్తవారే.  అయినా నవీన్ పోలిశెట్టి తో పాటు అందరూ బాగా నటించారు. నటుడిగా, కథకుడిగాపేరుతెచ్చుకున్నారు. దర్శకుడిగా  స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే చేశారు. ఈ సినిమాకు సీక్ వెల్ కూడా ఉంటుందని అప్పట్లో చెప్పాడు. కాగా, ఈరోజుకు 4 ఏళ్ళు అయిన సంధర్భంగా నవీన్ పోలిశెట్టి లండన్ వెళ్లి చిన్న వీడియో పోస్ట్ చేసాడు. 
 
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 221B బేకర్ స్ట్రీట్ లండన్‌లో షెర్లాక్ హోమ్స్‌ని కలుసుకున్నారు. ఏజెంట్ అంతర్జాతీయ కేసుపై పని చేస్తున్నారా అనేలా బిల్డిప్ ఉంది. షెర్లాక్ హోమ్స్‌ ఈజ్ ఫిక్షనల్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్. ఏదైనా కేసు ఉంటె FBIనెల్లూరు కాల్ చేయండి. అంటూ విజిటింగ్ కార్ద్ అక్కడివారికి ఇచ్చి ఎంటర్టైన్ చేసాడు. ఇక నవీన్ నటించిన మిస్. శెట్టి మిస్టర్  పోలిశెట్టి సినిమా విడుదలకు సిద్ధమైంది. అనుష్క హీరోయిన్.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు