వైజాగ్ లో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్, యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి సందడి చేశారు. నిన్న రాత్రి వైజాగ్ బీచ్ రోడ్డులోని సిగ్నల్ వద్ద కె.ఏ.పాల్ తన వాహనాన్ని ఆపి యువతతో ముచ్చటిస్తున్నారు. సీఎం అంటూ అక్కడున్న వారంతా నినాదాలు చేస్తుండగా కె.ఏ.పాల్ శైలి లో అందరికి అభివాదం చేశారు. ఇన్తలో ఆయన పక్కన మరో కారు ఆగింది.