హీరోయిన్ నయనతార నటిస్తున్న 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేరట. అందుకే ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. నయనతార నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హితేష్ జబక్, దర్శకుడు సర్గుణం సంయుక్త నిర్మాణంలో యువ దర్శకుడు దాస్ రామస్వామి తెరకెక్కించారు.
ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ల తర్వాత అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. నయనతార డీగ్లామర్ రోల్‌లో నటించినా ఈ సినిమా కోసం యూత్ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది.