ఈ సినిమాలో తన నటనకు ఈ యేడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ పొందారామె. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ సినిమాని తెలుగులోకి అనువదించారు. సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ప్రథమార్థంలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: గోపిసుందర్, సహనిర్మాతలు: ఎ.వి. ప్రభాకరరావు, ఉమాశంకర్ నండూరి, దర్శకత్వం: ఎ.కె.సాజన్.