గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. కస్టమర్లు గతంలో ఆహారంలో రాళ్ళు, కీటకాలు వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని దివ్య అంటున్నారు. ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం ఆహారంలో 'పురుగు' ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను కలవరపెట్టి, ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని బెదిరించిందని దివ్య తెలిపారు.
ఆ వీడియోను ప్రసారం చేయకుండా ఉండటానికి ఆ బృందం రూ. 25 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. బ్రాండ్ ఇమేజ్‌ను కించపరచడానికి, డబ్బును వసూలు చేయడానికి ప్రయత్నించినందుకు ఆ బృందంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దివ్య వెల్లడించారు.
ఇదేవిధంగా తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పొంగలిలో పురుగు అని ఆరోపిస్తూ రెండు వీడియో క్లిప్‌లు ప్రసారం అయ్యాయి. కస్టమర్ హోటల్ సిబ్బందితో "నీకు అది కనిపించిందా?" అని కోపంతో అడిగాడు. వెంటనే కస్టమర్‌కు వడ్డించిన సిబ్బంది పొంగల్‌లో పురుగు పరిశీలించి క్షమాపణలు చెప్పాడు. అయితే ఇదంతా సోషల్ మీడియా పాపులారిటీ కోసమని హోటల్ యాజమాన్యం కొట్టిపారేసింది.