సాధారణంగా ప్రియుడుని కొంగున కట్టేసుకొంది అన్నది సామెత. కానీ, ఈ సుందరాంగి విషయంలో మాత్రం ఈ సామెత వర్తించదు. ప్రియుడిని చెవికి పెట్టుకొన్న (కట్టేసుకొన్న) ప్రియురాలు అని అనాల్సిందే. దీనికి కారణం లేకపోలేదు. పైగా ఆ సుందరాంగి ఎవరో కాదు. టాలీవుడ్ నటి నయనతార. కొన్నాళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.
నయన్ ప్రియుడిని చెవికి పెట్టేసుకొంది అనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజర్లు. నయన్ తనలో ప్రేమని అస్సలు దాచుకోలేదు. గతంలో శంభు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ల కోసం ప్రత్యేకంగా కనిపించిన సందర్బాలున్నాయి.