సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. ఫిలిం నగర్ లీజు వ్యవహారంపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటం ఇందుకు కారణమైంది. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదని గంటా అన్నారు. తనకు తెలియకుండానే వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా వార్నింగ్ ఇచ్చారు.
వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తన భీమిలి నియోజకవర్గం పరిధిలోని అంశమని.. తనకు తెలియకుండా ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారంటూ గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. దీనిపై బహిరంగంగా విష్ణుకుమార్ రాజుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని ఫిలిం నగర్ లీజు వ్యవహారాన్ని తనకు తెలియకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని విష్ణుకుమార్ రాజును గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
ఇష్టానుసారం వ్యవహరించేది లేదని విష్ణుకుమార్ రాజుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఫిలిం నగర్ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరంటూ గంటా శ్రీనివాసరావుకు విష్ణుకుమార్ రాజు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డుపై కారు వద్ద ఈ వ్యవహారం నడిచింది. అయితే ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గంటా శ్రీనివాస్ రావు ???? విష్ణు కుమార్ రాజు
నా నియోజకవర్గం లో ని పెత్తనం ఏంటి అని గంటా కి వార్నింగ్ ఇచ్చిన విష్ణు కుమార్. pic.twitter.com/MvCLQbL4bO
— Guerrilla Warfare (Chatrapathi Shivaji Army????????) (@ADDICTEDTOAMMA) April 26, 2025