Nikhil, Samyukta new poster
నిఖిల్ 'కార్తికేయ 2' విజయంతో ఇప్పుడు మరో ఇండియా వెంచర్ 'స్వయంభు'తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో వుంది. ఈ చిత్రంలో నిఖిల్ మునుపెన్నడూ చూడని యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్-ఇండియా విజన్ తో రూపొందిస్తున్నారు.