యదార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి, నిర్మించారు. గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆకట్టున్నారు. ఈ సినిమాలో అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ అద్భుతమైన విజువల్స్, సంతు ఓంకర్ హాంటింగ్ స్కోర్, అనిల్ కుమార్ చేసిన ఎడిటింగ్...నింద మూవీని స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ క్లాస్ గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్ట్రీమింగ్ ఆమోదంతో నింద నెక్స్ట్ లెవెల్ కి చేరనుంది.