భార్యాభర్తలం.. అలాంటి కథలు మాకు సెట్ కావన్న చైతూ..?

శుక్రవారం, 13 జులై 2018 (14:46 IST)
భార్యాభర్తలమైన తమకు అలాంటి సెట్ కావని చైతూ చెప్పాడట. తన భార్య సమంతతో కలిసి మళ్లీ తెరపై భార్యాభర్తలుగా నటించడం సరిగ్గా వుంటుంది కానీ ప్రేమ కథా చిత్రాల్లో భార్యాభర్తలు కలిసి నటించడం అంత హైప్‌ని ఇవ్వదని చైతూ చెప్పాడట.


కానీ చైతూకి దర్శకుడు శివ నిర్వాణ ఓ సూపర్ కథను వినిపించాడని.. ఆ స్టోరీ విన్నాక మళ్లీ తాము తెరపై జోడీగా కనిపించేందుకు సిద్ధమని చెప్పాడట. భార్యాభర్తలుగా కనిపించే ఈ స్టోరీకి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. 
 
పెళ్లికి ముందు సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా కలిసి నటించారు. కానీ పెళ్లయ్యాక వీరిద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో రారండోయ్ వేడుక చూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు సినిమాల్లో సమంతనే కథానాయికగా తీసుకోవాలని దర్శకులు ప్రయత్నించారు. 
 
కానీ భార్యాభర్తలమైన తమకి ఆ కథలు సెట్ కావని చైతూ చెప్పాడట. దీంతో భార్యాభర్తల మధ్య పరిణతి చెందిన ప్రేమ కథలో నటించేందుకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమ చేతిలో వున్న సినిమాలు పూర్తయ్యాక చైతూ-సమంత ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు