అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరుకానున్న రామ్ చరణ్, ఉపాసన

డీవీ

శుక్రవారం, 1 మార్చి 2024 (14:19 IST)
Ram Charan, upasana, Anant Ambani, Radhika
గుజరాత్ లోని జామ్ నగర్ కు రామ్ చరణ్,  ఉపాసన కామినేని కొణిదెల వెళుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 28న జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.  వివాహానికి ముందు జరిగే ఉత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిఐపి.లను స్వాగతించడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్ అంతా అలంకరించబడి ఉంది.

మార్చి 1 నుండి 3 వరకు జరిగే ఉత్సవాల ముందు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ వరుడు అనంత్ అమాబ్నీ తల్లి నీతా అంబానీ తన కుమారుడి వివాహానికి తనకు ఉన్న రెండు కోరికలను పంచుకున్నారు. ఇక్కడే తమ జీవితం ప్రారంభమైందని గుర్తుచేస్తూ సంస్క్రితికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
 
జామ్‌నగర్‌లో ప్రధాన వేడుకలు ఎవర్‌ల్యాండ్‌లో యాన్ ఈవినింగ్ అనే సంగీత ఫంక్షన్‌తో ప్రారంభమవుతాయి.  ఇక్కడ అతిథులు జామ్‌నగర్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. గురువారం సాయంత్రం జరిగిన వేడుకలకు షారుఖ్ ఖాన్ మరియు కుటుంబం కూడా వచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు